Rashmika Mandana -Pooja Hegde In Bollywood | సౌత్ హీరోయిన్స్ నార్త్‌లో నటించడం అనేది ఎప్పటి నుంచో ఉంది. అలనాటి వైజయంతి మాల, రేఖ, శ్రీదేవి, జయప్రద నుంచి ఇప్పటి తరం ఐశ్వర్యారాయ్, దీపికా పదుకొణే వరకు చాలా మంది భామలు సౌత్ నుంచి వెళ్లి నార్త్ (బాలీవుడ్)లో సత్తా చాటినవాళ్లే. ఇప్పటికే పూజా హెగ్డే బాలీవుడ్లో నటించింది. లేటెస్ట్గా రష్మిక మందన్న కూడా బాలీవుడ్ ‘మిషన్ మజ్ను’ సినిమాతో బాలీవుడ్ వెళుతుంది. వీళ్ల కంటే ముందు బీ టౌన్లో సత్తా చాటిన హీరోయిన్స్ ఎవరున్నారంటే.. (Pooja Hegde Rashmika Mandanna)
కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టి.. ఆపై తెలుగుతో సత్తా చాటిన రష్మిక మందన్న ఇపుడు బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్‌లో యాక్ట్ చేయడానికి రెడీ అవుతోంది. సిద్ధార్ధ్ మల్హోత్ర హీరోగా నటిస్తోన్న‘మిషన్ మజ్ను’ సినిమాతో బాలీవుడ్లో తెరంగేట్రం చేస్తోంది. (Twitter/Photo)
సౌత్ సినిమాలతో తెరంగేట్రం చేసిన పూజా హెగ్డే.. హృతిక్ రోషన్ హీరోగా నటించిన ‘మొహంజోదారో’ సినిమాతో బాలీవుడ్లో లెగ్ పెట్టింది. ఆ తర్వాత అక్షయ్ కుమార్ ‘హౌస్‌ఫుల్ 4’లో యాక్ట్ చేసింది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌లో హీరోయిన్గా నటించబోతుంది. (Twitter/Photo)
సౌత్ సినిమాల్లో స్టార్ హీరోయిన్గా సత్తా చాటిన త్రిష.. బాలీవుడ్లో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘కట్టా మీటా’ సినిమాలో నటించింది. హిందీలో త్రిష నటించిన ఏకైక చిత్రం ఇదే కావడం విశేషం. (Twitter/Photo)
రమ్యకృష్ణ కూడా పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించి సత్తా చాటింది. (Twitter/Photo)
తెలుగు, తమిళంలో హీరోయిన్గా సత్తా చూపెట్టిన రంభ హిందీలో పలు చిత్రాల్లో నటించి అక్కడ కూడా రఫ్ఫాడించింది. (Twitter/Photo)
చిరంజీవి హీరోగా నటించిన ‘ది జెంటిల్మెన్’ హిందీ సినిమాలో ఐటెం సాంగ్‌లో మెరిసింది. (File/Photo)
మీనా కూడా ‘పరదా హై పరదా’ అనే ఒకే ఒక్క హిందీ సినిమాలో నటించింది. (file/Photo)
సుమలత అంబరీష్ కూడా చాలా బాలీవుడ్ సినిమాల్లో నటించి సత్తా చూపెట్టింది. (File/Photo)
Coourtesy – MSN